వికీపీడియాలో వ్యాసాలు తొలగించబడుతూ ఉంటాయి. పేజీలోని వ్యాసాన్ని పూర్తిగా తీసివేసి పేజీని ఖాళీ చెయ్యడం ఏ సభ్యుడైనా చెయ్యగలరు, కానీ వ్యాసం పూర్తి పాఠం చరితంలో భద్రంగా ఉంటుంది కాబట్టి కావాలంటే దానిని మళ్ళీ స్థాపించవచ్చు. కానీ పేజీని తొలగించినపుడు, పేజీకి చెందిన పాత కూర్పులు కూడా పోతాయి.
పేజీల తొలగింపుకు, పునస్థాపనకు నిర్వాహకులకు మాత్రమే అనుమతులు ఉన్నాయి.
వికీపీడియా వ్యాసం ఉన్న పేరుతోనే ఖచ్చింతంగా శోధన చేయడం అందరికీ తెలవకపోచ్చు .
తెలుగు వ్యవహారిక ఆభాషలో వ్యాసంలోని తెలుగేతర పదాల వలన లేదా పదాల మధ్యన ఖాళీలు, ఉచ్ఛారణలోని పద్దతులు, పొట్టిపేర్లు-పొడువుపేర్లు తదితర కారణాల వల్ల తెవికీలో దారి మార్పులకు అవకాశం ఏర్పడుతుంది
దారిమార్పు ఇవ్వవలసిన పేరుతో ఒక కొత్త పేజీ ప్రారంభించి అందులో #దారిమార్పు [[అసలు వ్యాసం పేరు]] (అసలు వ్యాసంపేరు అంటే మనం దారిమార్పుతో చేరాల్సిన వ్యాసంపేరు) వ్రాసి భద్రపరిస్తే దారిమార్పు ఏర్పడినట్లే.
మరోరకంగా - ఎడిట్ బాక్సులో బాణం ఐకాన్ ఉన్న వ్యాసంపై నొక్కితే "#దారిమార్పు [[లక్ష్యిత పుట పేరు]]" అని వస్తుంది. లక్ష్యితపుటపేరు బదులు మనం అసలు వ్యాసం పేరు చేర్చిభద్రపర్చాలి.
దారిమార్పులు - అర్థవివరణ:
వ్యాసం పేరును ఏదో ఒకటి ఇచ్చినప్పుడు ఈ వ్యాసం కావలసిన వారు మరో పేరుతో వెదికితే వ్యాసం లభ్యంకాదు. ఈ కారణంతోనే పైన తెలిపిన రకరకాల పేర్లతో పేజీలు సృష్టించి అసలు వ్యాసానికి చేరేటట్లు ఇచ్చే లింకులే దారిమార్పులుగా పిలువబడుతుంది. అంటే అమెరికా పేరుతో ఉన్న పేజీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు పేజీకి దారితీస్తుంది.
వ్యాసంలోని విభాగాలకు దారిమార్పులు:
దారిమార్పులు వ్యాసాలకే కాకుండా అవసరం అనుకుంటే పాఠకుల ప్రయోజనాల దృష్ట్యా వ్యాస విభాగాలకు కూడా ఇవ్వవచ్చు.
ఎడిటర్ యొక్క కుడి ఎగువ భాగంలో "పేజీ ఎంపికలు" మెను తెరవండి
"పేజీ సెట్టింగులు" ఎంచుకోండి
"ఈ పేజీని దీనికి మళ్ళించండి" అని గుర్తు పెట్టబడిన పెట్టెను ఎంచుకోండి
చెక్ బాక్స్ క్రింద ఉన్న టెక్స్ట్ బాక్స్ లో లక్ష్య పేజీ పేరును నమోదు చేయండి
నీలం "మార్పులను వర్తించు" బటన్ పై క్లిక్ చేయండి
పేజీని సేవ్ చేయండి. మీరు సవరణ సారాంశాన్ని నమోదు చేయవచ్చు లేదా స్వయంచాలక సారాంశం సృష్టించబడుతుంది.
వ్యాసం త్వరగా తొలగించవలసిన కారణాల జాబితాలోకి రాకపోతే, ముందు దానిని ఒక ఐదు రోజుల పాటు తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో ఉంచాలి
క్లుప్తంగా తొలగించే పద్ధతి
ఒక వ్యాసాన్ని గానీ, బొమ్మను గానీ, దారిమార్పును గానీ, ఇతరాలను గానీ తొలగించే పద్ధతిలో ఉండే మెట్లు ఇవి:
తొలగింపు చర్చ, చర్చాపేజీలో సరిపడినన్ని రోజులు ఉన్న తరువాత చర్చను ముగించేటపుడు పాటించవలసిన పద్ధతి ఇది:
చర్చను పరిశీలించి, ముగింపు పలికేందుకు చాలా సమయం పట్టేట్టైతే, ముందు ఉపపేజీలో పైన {{ముగిస్తున్నాం}} మూసను పెట్టండి. దీనివలన మీరు ముగింపు చేస్తూ ఉండగా మరొకరు దిదుబాటు చేసి దిద్దుబాటు ఘర్షణ తలెత్తకుండా ఉంటుంది.
చర్చపై ఆధారపడి, మార్గదర్శకాలు వాడి వ్యాసాన్ని ఉంచాలో తొలగించాలో, సంబంధిత చర్చ, ఉప పేజీలను తొలగించాలో లేదో నిర్ణయించండి.
{{ముగిస్తున్నాం}} మూసను చేర్చి ఉంటే దాన్ని తీసెయ్యండి.
చర్చా ఉపపేజీలో పైన అడుగున కింది పాఠ్యాన్ని చేర్చండి. (ఈ రెండూ కలిసి చర్చ ముగిసినట్టు సూచిస్తూ, దాని చుట్టూ ఒక మసక పెట్టెను సృష్టిస్తాయి. క్రింది ఉదాహరణ చూడండి.) శీర్షం మూస, ముగింపు ఫలితం పై విభాగపు శీర్షానికి పైకి చేరతాయి, దాని కిందకు కాదు.
పైన:
{{subst:వ్యాతొలపైన}} '''ఫలితం'''. ~~~~
అడుగున:
{{subst:వ్యాతొలకింద}}
పేజీని తొలగింపు కొరకు వ్యాసాలు లో చేర్చగానే, ఈ సంగతి అందరికీ తెలియజేయడం మర్యాద. పేజీ పైభాగాన సంబంధిత మూసను/టాగును తగిలించడం అనేది సూచించబడిన విధానం.
పేజీని ఎందుకు తొలగించారో అనే సందేహాన్ని ఈ నోటీసు నివృత్తి చేస్తుంది. ఒక గమనిక: కాపీహక్కు సమస్యలకు వేరే నోటీసు ఉంది.
కింది సందర్భంలో నోటీసు అవసరం లేదు
వ్యాసం పేజీ ఖాళీగా ఉన్నపుడు (దారిమార్పు వంటివి), మరియు చెప్పుకోదగినంత చరితం లేనపుడు.
పేజీని ఒకసారి జాబితాలో చేర్చిన తరువాత సభ్యులు దానిని గమనించి వ్యాఖ్యానించడానికి వీలుగా ఒక నిర్ణీత సమయం పాటు అక్కడ ఉంచాలి. వివిధ పేజీలకు విభిన్న వ్యవధులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యవధులు ఇలా ఉన్నాయి:
కాపీహక్కు సమస్యలు – ఒక వారం (వాస్తవానికి రెండు వారాల వరకు ఉండొచ్చు)
తొలగింపు కొరకు బొమ్మలు – ఒక వారం పాటు
తొలగింపు కొరకు దారిమార్పులు - ఒక వారం పాటు
తొలగింపు కొరకు మూసలు – ఏడు రోజులు
తొలగింపు కొరకు మొలక రకాలు - ఏడు రోజులు
త్వరిత తొలగింపు – వ్యవధి లేదు
తొలగింపు కొరకు వ్యాసాలు – ఐదు రోజులు
ఫైల్‌ను వేరే పేరుకు తరలించడం ; కొద్దిమంది వినియోగదారులు (" నిర్వాహకులు " మరియు " ఫైల్ మూవర్స్ ") మాత్రమే దీన్ని చేయగలరు
అభ్యర్థన చేయడానికి, template media పేరు మార్చండి }
దారిమార్పు ఎందుకు?
ఒకే వ్యాస విషయానికి వివిధ పేర్లు ఉన్నప్పుడు (ఉదా: ఎన్.టి.రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీయార్)
ఒకే మాటను రెండు రకాలుగా పలుకుతున్నపుడు (ఉదా: కళ్ళు / కళ్లు, తాళ్ళరేవు, తాళ్లరేవు )
సాధారణంగా జరుగుతూ ఉండే తప్పులు (ఉదా: అల్లూరి సీతారామ రాజు, అల్లూరి సీతారామరాజు)
ఏదైనా పేజీని తరలించినపుడు బయటి సైట్ల నుండి ఆ పేజీకి వచ్చే లింకులు తెగిపోకుండా సదరు పేజీని చేరుకునేందుకు
తొలగింపు నిర్ణయ విధానం ఏమిటి?
తొలగింపు విజ్ఞప్తిని తొలగింపు కొరకు వ్యాసాలులో ఉంచిన ఐదు రోజుల తరువాత, ఒక స్థూల విస్తృతాభిప్రాయం వస్తే, ఆ పేజీని తొలగిస్తారు. లేదంటే తొలగించరు. స్థూల విస్తృతాభిప్రాయం ఎంత అనే దానిపై భిన్నాభిప్రాయాలున్నాయి – మూడింట రెండు వంతులు ఆధిక్యత ఉండాలని కొందరంటే, మరి కొందరు ఇంకా ఎక్కువ ఉండాలంటారు.
పేజీని జాబితాలో చేర్చిన తరువాత అది మెరుగుపడి, తొలగించవలసిన అవసరం ఇప్పుడు లేకపోతే కూడా పేజీని తొలగించరు.
విస్తృతాభిప్రాయం తల లెక్కింపుపై ఆధారపడి నిర్ణయించేది కాదు, వాదనలోని పటుత్వాన్ని బట్టి, దానికి ఆధారభూతమైన విధానాన్ని బట్టి దాన్ని నిర్ణయించాలి. విధాన విరుద్ధంగా ఉన్న వాదనలు, వాస్తవాలపై కాక అభిప్రాయంపై ఆధారపడినవి, తార్కికంగా లేనివి అయిన వాదనలను పక్కన పెడతారు. ఉదాహరణకు, ఒక పేజీ యావత్తూ కాపీహక్కుల ఉల్లంఘనే అని ఎవరైనా గుర్తిస్తే, ఆ పేజీని తొలగిస్తారు. కానీ పేజీలో మూలాలు చూపించలేదనే వాదన తరువాత ఎవరైనా సభ్యుడు మూలాలను చేర్చారనుకోండి.. ఆపై సదరు వాదన సంబద్ధం కాబోదు.
స్థూలంగా ఒక విస్తృతాభిప్రాయం ఏర్పడిందనే విషయం నిర్ధారించేందుకు నిర్వాహకులు తమ వివేచనను, నిష్పాక్షికతను ఉపయోగించాలి.
దారిమార్పుల పరిమితులు ఏమిటి?
ఒక వ్యాసం పేరును తొలగించాలి, కానీ అందులోని కొంత పాఠ్యాన్ని మాత్రం వేరే వ్యాసంలో వాడదలచారు. అప్పుడు వ్యాసాన్ని ప్రస్తుతపు శీర్షిక నుండి మెరుగైన శీర్షికకు తరలించండి. ఒకే వ్యాసం పేజీకి రకరకాల పేర్లతో దారిమార్పులు చేయరాదు ,వ్యాసం యొక్క స్థాయిని బట్టి దారిమార్పులు ఇవ్వాలి.
ఆంగ్ల పేరుతో దారిమార్పులు ఇచ్చేటప్పుడు తెలుగులో సరైన పదము ఉన్నదేమో ఆలోచించండి వీలైతే ఆపేరును ఉపయోగించండి,
దారిమార్పులకు దారుమార్పులు ఇవ్వకండి.
దిద్దుబాటు యుద్ధమంటే ఏమిటి?
దిద్దుబాటు చేసేందుకు వెనకాడవద్దని వికీపీడియా ప్రోత్సహిస్తుంది. కానీ ఏదైనా వివాదాస్పద మార్పు చేసినపుడు వేరే వాడుకరి దాన్ని తిరగ్గొట్టవచ్చు. ఇది చర్చకు ప్రారంభం కావచ్చు. ఇది వరసబెట్టి తిరగ్గొట్టడం, తిరిగి రాయడం, మళ్ళీ తిరగ్గొట్టడం వంటి చర్యలకు దారితీస్తే దిద్దుబాటు యుద్ధం మొదలైనట్లే. ఏదేమైనప్పటికీ, ప్రతీ రివర్టు, లేదా ప్రతీ వివాదాస్పద మార్పూ దిద్దుబాటు యుద్ధం కావు
సమస్య వచ్చిన పేజీ/బొమ్మ/వర్గం ను ఏంచెయ్యాలి
పేజీ నిజంగా తొలగింపు ప్రతిపాదనలో పెట్టవచ్చా? ఇది తెలుసుకోవడానికి కింది పట్టికలను చదవండి.
నేను వ్యాసాన్ని చెడగొట్టినట్లు తెలిపారు, కాని నేను అలా చేయలేదు! ఇప్పుడు ఏమి చేయాలి?
మీరు వ్యాసాన్ని చెడగొట్టినట్లు సందేశం వచ్చి వుంటే, కాని మీరు అలా చేయకపోతే మీరు చేసిన మార్పు దుశ్చర్య కానప్పటికీ వికీపీడియా విధానాలకి సరిపోలనిదయ్యుండవచ్చు. ఇప్పుడు ఏమి చేయాలి. ప్రత్యేకంగా తటస్థ దృక్కోణం విధానంపై ధ్యాస పెట్టండి.
మీరు వాడుతున్న ఐపి చిరునామా వికీపీడియాలో దుశ్చర్యలను చేస్తున్నట్లుగా కనుగొని వుండవచ్చు. సందేహమొచ్చినప్పుడు, మీకు సందేశమిచ్చిన వ్యక్తిని సంప్రదించండి. వికీపీడియా సాధారణ వాడుకరిని, దుశ్చర్యలకు పాల్పడే వాడుకరిని వేరుచేయలేదు. మీరు ఖాతా తెరిచి మార్పులు చేస్తే మీకు ఇబ్బంది వుండదు.